పిక్ టాక్ : అందాలతో దుమారం రేపుతోంది

70
- Advertisement -

మలైకా అరోరా తన అందంతో సోషల్ మీడియాలో నిత్యం మంట పెడుతూనే ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. వయసు అయిపోతున్నా అమ్మడులోని సొగసుల ఘాటు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఈ ముదురు ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ మెల్లమెల్లగా నేటి యూత్ లోనూ పాపులారిటీ పెంచుకుంటుంది. ఈ మధ్య అందాల ఆరబోతలో అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకునేలా గ్లామర్ ని ఒలకబోస్తూ మొత్తానికి మలైకా అరోరా అందాల అరాచకాన్ని చూపిస్తోంది.

ఈ క్రమంలోనే ఈ ముదురు భామ తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో మరోసారి అదిరిపోయే అవుట్ ఫిట్ తో దర్శనమిచ్చింది. ఏంజెలా టైట్ అవుట్ ఫిట్ లో కళ్ళతోనే మాయ చేసేలా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మలైకా అరోరా దిగిన లేటెస్ట్ పిక్స్ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ ఫోజులతో నెటిజన్స్ చూపు తిప్పుకోకుండా చేసింది. దీంతో మలైకా అరోరా ఫ్యాన్స్ ఈ హాట్ పిక్స్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా మలైకా ఈ డ్రెస్ లో మరింత హాట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా కొన్నాళ్లుగా ఈ ముంబై ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన అందంతో కుర్రకారును ఇలాగే అడ్డు అదుపు లేకుండా కుమ్మేస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ లో మెరుస్తూ తెగ సందడి చేస్తోంది. దీంతో, సోషల్ మీడియాలో నెటిజన్స్ మలైకా అరోరాను మరింత ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మలైకా అరోరా లేటెస్ట్ స్టన్నింగ్ లుక్స్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ, మలైకా అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:ఎక్కడికి పారిపోలేదు:పల్లవి ప్రశాంత్

- Advertisement -