మగవారిలో ‘మోనోపాజ్’ లక్షణాలు.. జాగ్రత్త !

21
- Advertisement -

సాధారణంగా మోనోపాజ్ అనేది ఆడ వారిలో కనిపించే లక్షణం. వయసు పెరిగే కొద్ది వారిలో రుతుక్రమం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు. అయితే ఈ మోనోపాజ్ అనేది మగవారిలో కూడా కనిపిస్తుందా అంటే అవుననే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఆడవారిలో మాదిరి మగవారిలో రుతుక్రమం ఉండదు కదా ? మరి మోనోపాజ్ ఎలా వస్తుంది అనే డౌట్ రావొచ్చు. అయితే మగవారిలో వచ్చే దానిని ఆండ్రోపాజ్ అంటారు. ఇది సాధారణంగా 45 ఏళ్లు పైబడిన మగవారిలో కనిపిస్తుంది. ఆండ్రోపాజ్ వచ్చిన మగవారిలో టెస్టోస్టెరాన్ శాతం పూర్తిగా తగ్గిపోతుంది. అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది. ఇంకా వీర్య వృద్ధి కూడా తగ్గిపోతుంది. ఈ దశనే ఆండ్రోపాజ్ అని సూచిస్తారు.

ఈ దశలో ఉన్న మగవారిలో కండరాల బలహీనత ఏర్పడుతుంది. మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలకు త్వరగా లోనవుతుంటారు. ఇంకా ఎముకల బలహీనత, ఏ పని చేయలేకపోవడం వంటి లక్షణాలు కూడా మోనోపాజ్ లక్షణాలకు సంకేతాలే. ప్రధానంగా మోనోపాజ్ దశలో ఉన్న మగవారిలో లైంగిక ఆసక్తి తగ్గుముఖం పడుతుంది. ఇంకా నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. ఇవే కాకుండా చికాకు, కోపం, తెలియని బాధ, చిన్న విషయాలను పెద్దగా ఆలోచించడం వంటి ఎన్నో రుగ్మతలు వెంటాడుతాయి.

అయితే మగవారిలో కనిపించే ఈ ఆండ్రోపాజ్ పట్ల సరైన అవగాహన లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి ముఖ్యంగా వయసు పైబడినవారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం, పండ్లు, కూరగాయలు, వంటివి ఎక్కువగా తినడం, ప్రతిరోజూ కొద్దిపాటి వ్యాయామానికి సమయం కేటాయించడం, మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభించి మగవారిలో వచ్చే మోనోపాజ్ ను ఎదుర్కోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు,

Also Read:చింతపండుతో ఉపయోగాలు తెలుసా?

- Advertisement -