బెడ్ సీన్‌పై నెటిజన్‌ ప్రశ్న.. మాళవికా ఫైర్!

54
malavika
- Advertisement -

మాళ‌వికా మోహ‌న‌న్‌.. కోలీవుడ్‌ టాప్ హీరోయిన్‌. ఓ వైపు సినిమాలు మరోవైపు గ్లామ‌ర్ ఫొటోలు, వీడియోల‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ అమ్మడు తాజాగా చిట్ చాట్ కార్య‌క్ర‌మం నిర్వహించింది. అయితే ఓ నెటిజన్‌.. ధ‌నుష్‌తో మాళవిక నటించిన బెడ్ రూమ్ సీన్ గురించి అడిగి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆ సీన్‌కు సంబంధించి స్క్రీన్ ప్రింట్ తీసి..ఈ సీన్‌ను ఎన్ని సార్లు చిత్రీక‌రించారు అని అడిగేశాడు.

ఇక దీనిపై తనదైన శైలీలో స్పందించింది మాళ‌వికా. నీ తలలో ఏదో పాడైనట్లుంది అని ఘాటు రిప్లై ఇవ్వగా నెటిజన్‌ షాక్‌కు గురయ్యాడు. ఇక మాళవికాకు మద్దతుగా మిగితా నెటిజన్లు కూడా నిలవడంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

సినిమాటోగ్రాఫ‌ర్ కె.యు.మోహ‌న‌న్ కుమార్తె మాళ‌వికా మోహ‌న‌న్‌. త‌మిళ‌, మ‌ల‌యాళ , క‌న్న‌డ‌, హిందీ చిత్రాల్లోనే ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించింది. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో న‌టించ‌లేదు.

- Advertisement -