తెలంగాణలో ఆదివాసి తెగకి చెందిన ఓ 13 ఏళ్ల బాలిక పూర్ణ మాలావత్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, అత్యంత పిన్న వయస్సులో ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించి తెలంగాణ కీర్తిని ఎవరెస్ట్ పై నిలిపిన సంగతి తెలిసిందే.. తాజాగా మరో తెలంగాణ విద్యార్థిని బీ శ్రీ విద్యతో కలిసి పూర్ణ మాలావత్ మౌంట్ ఎల్‌బ్రస్ పర్వతంపై తెలంగాణ కీర్తి పతాకను ఎగరవేసింది. ఆలేరులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయానికి చెందిన విద్యార్థిని శ్రీ విద్య మౌంట్ ఎల్‌బ్రస్‌పై జాతీయ జెండాతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించి, తెలంగాణ గొప్పదనాన్ని, ప్రాముఖ్యతను ప్రపంచానికి వెలుగెత్తి చాటింది. ఏడు ఖండాల్లో ఉన్న ఏడు శిఖరాలను అధిరోహచడం తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు పూర్ణ పేర్కోంది..
రష్యాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎల్‌బ్రస్ పర్వతంపై అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 9.30 గంటలకు శ్రీ విద్య అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. మౌంట్ ఎల్‌బ్రస్ యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. దీని ఎత్తు 5,642 మీటర్లు (18,506 అడుగులు).