- Advertisement -
రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ సుష్మ మహేందర్ రెడ్డి, శంషాబాద్ మున్సిపల్ పరిధి రాజ్ దూత్ కాలనీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం బాగా విజయవంతమైనది, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది అని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఈ సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ గారిని అభినందించారు. ఈ ఛాలెంజ్ ఇలానే కొనసాగాలని మరో ముగ్గురికి.. నర్సంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిని , బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్ , ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతికి ఛాలంజ్ విసిరారు.
- Advertisement -