పూరీ ఆకాశ్ ‘రోమాంటిక్’ లో బాలీవుడ్ నటుడు

251
puri akash Makarand Deshpande
- Advertisement -

యువ క‌థానాయ‌కుడు ఆకాష్ పూరి తాజాగా న‌టిస్తున్న చిత్రం `రొమాంటిక్‌`. ఆకాష్ కు జోడిగా కేతికా శ‌ర్మ న‌టిస్తుంది. అనిల్ పాదూరి ఈ సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా గోవాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌ముఖ టెలివిజ‌న్ యాంక‌ర్‌, న‌టి దిరాబేడీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో విల‌క్ష‌ణ న‌టుడు ఈ సినిమాలో వ‌ర్క్ చేయ‌నున్నారు. ఆయ‌నే మ‌క‌రంద్ దేశ్ పాండే. దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత మ‌క‌రంద్ దేశ్ పాండే న‌టిస్తున్న తెలుగు స్ట్ర‌యిట్ మూవీ ఇదే.

ఈ చిత్రంలో ఇంకా రాజీవ్ క‌న‌కాల‌, దివ్య ద‌ర్శిని, మందిరా బేడి అంద‌రూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ఆకాష్ పూరి తండ్రి పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. పూరి, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. లావ‌ణ్య స‌మ‌ర్పిస్తున్నారు. పూరీ ఆకాశ్ నటించిన ఆంధ్రాపోరి, మెహబూబా సినిమాలు భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు ఆకాశ్ పూరీ.

- Advertisement -