అడవి శేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు జై కొట్టారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని మంచి వసూళ్లను రాబడుతోంది.
ఈ సినిమా ఫస్ట్ వీక్ థియేట్రికల్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.25 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. అటు గ్రాస్ పరంగా ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఏరియాల వారిగా కలెక్షన్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
నైజాం – 6.66 కోట్లు,సీడెడ్ – 1.90 కోట్లు,ఉత్తరాంధ్ర – 2.25 కోట్లు,గుంటూరు – 0.97 కోట్లు,ఈస్ట్ – 0.85 కోట్లు,వెస్ట్ – 0.74 కోట్లు,కృష్ణా – 0.93 కోట్లు,నెల్లూరు – 0.38 కోట్లు,టోటల్ ఏపీ+తెలంగాణ – 14.68 కోట్లు,రెస్టాఫ్ ఇండియా – 6 కోట్లు,ఓవర్సీస్ – 5 కోట్లు,టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.25.68 కోట్లు రాబట్టింది.