ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మజిలీ బ్యూటీ..!

548
divyansha kaushik
- Advertisement -

అక్కినేని నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్నమైన ప్రేమకథా చిత్రం మజిలీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ దివ్యాన్ష కౌశిక్‌. మజిలీ హిట్‌తో గోల్డెన్ లెగ్ ముద్రవేసుకున్న ఈ బ్యూటీ తర్వాత ఏ మూవీకి కమిట్ కాలేదు.

మజిలీ విడుదలైన ఆరు నెలల తర్వాత తన తర్వాతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ సారి ఈ అమ్మడు చేయబోయే సినిమా తెలుగులో కాదు తమిళ్‌లో.

సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న టక్కరి మూవీలో కీ రోల్ పోషిస్తోంది. సోలో హీరోయిన్‌గా ఈ మూవీలో దివ్యాన్ష నటిస్తోండగా కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ్‌కు ఈ అమ్మడితో మూవీతో లక్కు కలిసోస్తుందో లేదా వేచిచూడాలి.

- Advertisement -