మైదా పిండి పదార్థాలు తింటే ప్రమాదమే!

27
- Advertisement -

బయటి హోటల్స్ లో తినే ఆహార మెనులో దాదాపు సగానికి పైగా మైదాతో చేసిన పదార్థాలే ఉంటాయి. పరోటా, పిజ్జా, నుడిల్స్, రోటి, కేక్స్, కుకిస్.. ఇలా ఏ ఐటం తీసుకున్న అందులో అధికంగా ఉపయోగించేది మైదా నే. ఇందులో శరీరానికి అవసరమైన ఎలాంటి పోషకాలు ఉండవు. గోదుమ పిండి తయారీలోని వ్యర్థాలకు బెంజయిల్ పెరాక్సైడ్, ఆలోక్సన్ వంటి రసాయనాలను కలిపి మైదాపిండి తయారు చేస్తారు. అందుకే ఈ పిండి తెలుగు రంగులో ఉంటుంది. అయితే ఇందులో ఉండే రసాయనాల కారణంగా దీనిని వైట్ పాయిజన్ గా చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే మైదాపిండితో చేసిన పదార్థాలు తింటే లాభాల కన్నా నష్టాలే అధికంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటూ ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మైదాతో చేసిన పదార్థాలు తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది. .

ఇంకా రక్తంలో చక్కెర శాతం కూడా పెరిగి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మైదా పదార్థాలు తింటే వారిలో మెదడు పనితీరు మందగిస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి లోపించి అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది. మైదాపిండికి ఉండే జిగట కారణంగా దీనిని తింటే జీర్ణ శక్తి దెబ్బ తింటుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. తద్వారా అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంకా మైదా పదార్థాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కు కూడా దారి తీస్తుందట. కాబట్టి హోటల్స్ లోనూ, రెస్టారెంట్స్ లోనూ విరివిగా లభించే మైదా పదార్థాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:వసూళ్లలో మహారాజ జోరు!

- Advertisement -