ఇప్పపువ్వు గురించి సిటిల్లో నివసించే వారికి పెద్దగా తెలియకపోవచ్చు గాని.. పల్లెటూళ్లలో ఉండే వారికి చాలా బాగా తెలుసు. దీని ద్వారా నాటుసార తయారు చేస్తుంటారు. ఇంకా ఇప్పపువ్వును పలు ఆయుర్వేద ఔషధల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పపువ్వును నేరుగా తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ రకాల ఉదర సమస్యలను ఇప్ప పువ్వుదూరం చేస్తుందట. అల్సర్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారు కొద్దిగా ఇప్పపువ్వును నమిలి దాని రసాన్ని తాగితే ఎటువంటి ఉదర సమస్యలైన క్షణాల్లో మాయమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..
ఇందులో ఉండే ఒలెక్ యాసిడ్ గుండె సంబంధిత జబ్బులను రాకుండా చేస్తుందట. ప్రతిరోజూ ఇప్పపువ్వు ను నీటిలో మరిగించి, ఆ నీటిని నోట్లో వేసుకొని పుక్కలించడం వల్ల నోటిపూత, నోటి మంట వంటి సమస్యలు రావట. ఇప్పపువ్వు ను పాలలో వేసుకొని తాగడం వల్ల శరీరానికి మంచి పోషణ అందుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనితో తయారు చేసిన నూనెను మోకాళ్ళ నొప్పులకు కీళ్ల నొప్పులకు నివారణగా కూడా ఉపయోగించవచ్చు. ఇంకా చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమమస్యలను తగ్గించేందుకు కూడా ఇప్పపువ్వు రసం ఎంతగానో ఉపయోగపడుతుందట. ఇంతే కాదు ఈ మొక్క బెరడు, గింజలను కూడా ఆయుర్వేద ఔషధలలో ఉపయోగిస్తారు. నరాల బలహీనత ఉన్నవారు ఇప్పపువ్వును పాలలో కలుపుకొని తాగితే ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read:ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం