శ్రీలంకలో అన్న ప్రధాని.. తమ్ముడు అధ్యక్షుడు..!

302
Srilanka
- Advertisement -

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలలో ఇటీవల భారీ మెజారిటీతో గెలిచిన గొటబయ రాజపక్స తన అన్న మహీందా రాజపక్సను కొత్త ప్రధానిగా నియమించారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ప్రకటించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న మహీందా నేడు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రస్తుత ప్రధాని రణీల్ విక్రమసింఘే బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. కాగా, ఇప్పుడు శ్రీలంకలో రెండు శక్తిమంతమైన పదవుల్లో అన్నదమ్ములు ఉండడం గమనార్హం. తమ్ముడైన గొటబాయ రాజపక్స అధ్యక్షుడు కాగా, అన్న మహీందా రాజపక్స ప్రధాని పదవులు చేపట్టడం గమనార్హం.

Sri Lanka’s Leader of Opposition Mahinda Rajapaksa will be sworn in as Prime Minister on Thursday by his younger brother and newly-elected President Gotabaya Rajapaksa,..

- Advertisement -