అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు టీఆర్ఎస్ మహిళా బంధు కేసీఆర్ సంబురాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మహిళా దినోత్సవ సంబరాలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కృష్ణకాంత్ పార్కు వద్ద మహిళా పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయాక సంఘాల ప్రతినిధులు వెయ్యి మందికి సన్మానం చేయనున్నారు.
ఈ నెల 6వ తేదీన నేడు పార్టీ మహిళా నాయకులు కేసీఆర్‌కు రాఖీలు కట్టాలని కేటీఆర్ సూచించారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లతో పాటు ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం నిర్వహించాలన్నారు.
7న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాల లబ్దిదారుల నివాసాలకు వెళ్లి వారిని కలిసి సెల్ఫీలు తీసుకోవాలని సూచించారు. 8న నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు.