ఊరూరా ఘనంగా ‘మహిళా బంధు కేసీఆర్‌’ సంబురాలు…

78
medak
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెన ఈ వేడుకలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి శ్రీ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు మొదటి రోజుల వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఏడున్నరేండ్లుగా మహిళాభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటిని లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు వేడుకలు నిర్వహించారు.

మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో మహిళ బంధు కేసీఆర్ జయహో అంటూ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ బంధు కేసీఆర్ జయహో, థాంక్యూ కేసీఆర్ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ, డప్పు చప్పుళ్ల నడుమ మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీని నిర్వహించి, మహిళ బంధు కేసీఆర్ జయహో అని ముగ్గులు తీర్చిదిద్ది మహిళల సంక్షేమం, సంరక్షణ కొరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫ్లెక్సీకి రాఖీ కట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక నినాదంతో చేసుకోవడం ఆనవాయితీ కాగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలంగాణలో మహిళా బంధు కేసీఆర్ పేరుతో చేసుకోవడం మహిళల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి, భద్రత , పోషణ కార్యక్రమాలకు గానూ వారికి ఈ రాష్ట్ర మహిళలు ఇస్తున్న ఒక కానుక అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా “మహిళా బంధు కేసీఆర్ ఉత్సవాలు”.. మహిళల అభ్యున్నతి కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో #ThankYouKCR అంటూ మానవహారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు పీర్జాదిగూడ మహిళా కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్లు, తదితరులు.

ముఖ్రా కె గ్రామంలో ఘనంగా మహిళా బందు కేసీఆర్ కార్యక్రమం… ఎడ్లబండిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫొటో పెట్టి గ్రామమంతా అభివృద్ధి పథకాలు వివరిస్తూ ర్యాలీ తీసిన ముఖ్రా కె గ్రామ మహిళలు. అడపిల్లలకు మేనమామై కల్యాణ లక్ష్మితో పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని… జీవితమంతా కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని తెలిపారు.

- Advertisement -