సిటీ ప్రయాణికులకు సేవలు పెంచాలి..

249
- Advertisement -

రోజు రోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ లో ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత విస్తరించాలని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ జోన్ మీద శాసన సభ కమిటీ హాల్ 3లో రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సమిక్షించారు.

ఎండీ రమణారావు, ఎంఎల్ఏ వివేకానంద, అరికేపూడి గాంధీ, కృష్ణా రావు,సుధీర్ రెడ్డి, కృష్ణా రావు,ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ , గ్రేటర్ ఈడీ పురుషోత్తం నాయక్, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. శాసన సభ 9వ సభావేశాలకు ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎంఎల్ఏలు వివేకానంద, కృష్ణారావు, అరికేపుడి గాంధీ లను అభినందించి, ప్రజల సభస్యల మీదా వారితో ఆరా తీశారు. సిటీలో ప్రయాణికుల అవసరాల కోసం కొత్త డిపోలకు స్థలం ఇస్తే పరిశీలిస్తామన్నారు.

    mahesnderreddy talk about bus services..

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్ స్టాప్ లు, సమయ వేళల పట్టికలు, మంచినీటి సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అందుకు కార్యాచరణ తయారు చేద్దామన్నారు. గ్రేటర్ లో ప్రస్తుతం బస్ స్టాప్ ల నిర్వాహణ జీహెచ్ఎంసీ పరిధిలోకి ఉన్నందున కనీసం బస్ స్టాప్ ల నిర్వహణ స్టాప్ ల బోర్డులు లేవని ఎంఎల్ఏలు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమై చర్చిద్దామని మంత్రి సూచించారు. అలాగే తమ ప్రాంతాల నుండి ఏపీ తో పాటు ఇతర దూర ప్రాంతాలకు సర్వీసులు పెంచాలని ఎంఎల్ఏలు కోరగా మంత్రి మహేందర్ రెడ్డి చర్యలకు ఆదేశించారు.

సాయంత్రం వేళలో కూకట్ పల్లి ఫేస్ 4, 7 ల మధ్యగల 49 ఎకరాల స్థలంలో , మియాపూర్, తదితర ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులతో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ప్రైవేటు ట్రావెల్ బస్సులను ఓఆర్ఆర్ బయట నిలిపేలా చర్యలకు మేడ్చెల్ డీటీసీ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ను, అధికారులను మంత్రి ఆదేశించారు. సికిందరాబాద్ తో పాటు గ్రేటర్ లోని అన్ని డిపోలలో అన్ని బస్సులు నిలిపేలా , డిపోలను, గ్యారేజీలను విస్తరించి ,మరమత్తులు చేయాలని సూచించారు. కొత్త గండిమైసమ్మ వద్ద , జగద్ గిరిగుట్ట,శామీర్పేట్,జవాహార్ నగర్ ల లో రానున్న భవిషత్ అవసరాల దృష్ట్యా బస్ డిపోల ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలి ఎండీ రమణారావును ఆదేశించారు.

ఉప్పల్,కూకట్‌ల్లిలో ఆధునిక బస్ బేల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలన్నారు. సికింద్రాబాద్, కోఠి,మేడ్చల్లతో పాటు ఇతర ప్రాంతాలల్లోనూ మహిళకు ప్రత్యేక సర్వీస్ ల ఏర్పాటు తో పాటు అవసరమైన రూట్ లలో సర్వీసులను పెంచేలా మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. బోయిన్ పల్లి – మేడ్చెల్, ఫతేనగర్ –సికిందరాబాద్, మెహదీపట్నం – కూకట్ పల్ల్లి, కోటీ తదితర డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సర్వీసులు పెంచాలని మంత్రి సూచించారు. కుద్బుల్లాపూర్ – చార్మినార్ సర్వీసుతో పాటు కుద్బుల్లాపూర్ కు ప్రత్యేక బస్సులు నడపాలన్నారు.

ప్రతీ స్టాప్ వద్ద బస్సులు విధిగా ఆపాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఆర్టీసీ బోర్డు సభ్యులు, ఈడీ ఎంవీ రావు, చీఫ్ మేనేజర్ కొమరయ్య, ఆర్ ఎంలు శివకుమార్, రమాకాంత్, సీటీఎం మునిశేఖర్, డీవీఎంలు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -