స్పైడర్ రివ్యూ !

322
Mahesh Babu's Spyder movie teaser release postponed
Mahesh Babu's Spyder movie teaser release postponed
- Advertisement -

మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ స్పైడర్’. ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ సందర్భంగా ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని , మహేష్ బాబు ఖాతాలో మరో సూపర్ హిట్ వచ్చి చేరిందని ఈ సంధర్బంగా సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు పేర్కోన్న సంగతి తెలిసిందే.

రిలీజ్‌కు మరో వారం మాత్రమే ఉండడంతో ఈ సినిమాను విదేశాల్లో సెన్సార్ కు పంపారు. భారత్ లోనే ఒక్క కట్ కూడా పొందకుండా యూ/ఏ సర్టిఫికేట్ సంపాదించుకున్న ‘స్పైడర్’ విదేశాల్లోని సెన్సార్ బోర్డు సభ్యులను కూడా ఫిదా చేసేసింది. ఈ నేపథ్యంలో అక్కడి సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమాల క్రిటిక్ ఉమేర్ సంధు ‘స్పైడర్’పై తన రివ్యూను ఇచ్చేశాడు.

స్పైడర్‌ సినిమా అద్భుతంగా ఉందని, సినిమాలో ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదని చెప్పాడు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు రేసుగుర్రంలా పరుగులు తీసిందని అన్నాడు. మహేష్ బాబు ఎప్పట్లాగే అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని తెలిపాడు. మురుగదాస్‌ డైరేక్షన్ బాగుందని, మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఉమేర్ సంధు తెలిపాడు.

రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, తమిళ నటులు ఎస్.జె. సూర్య .. భరత్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషలతో పాటు అరబిక్ భాషలోను విడుదలవుతుండటం విశేషం.

https://twitter.com/sandhumerry/status/909699773502025728

https://twitter.com/sandhumerry/status/909704328167948288

- Advertisement -