కృష్ణ మరణంపై ఫ్రిన్స్‌ తొలిసారి స్పందన..

191
- Advertisement -

నటశేఖరుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణ వార్త సినీలోకంలో ఓశకం ముగిసింది. అలనాటి తారాలైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్‌బాబు లాంటి హెమాహెమీలు మరణంతో…కళామతల్లికి పుత్రశోకం మిగిలింది అని టాలీవుడ్‌లో టాక్. కృష్ణ దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న అర్ధరాత్రి సమయంలో కృష్ణకు గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందిన కృష్ణ ఈ నెల 15న తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ చిన్న కుమారుడు మహేష్ తండ్రికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఈ ఏడాది మహేష్ కు కోలుకొని ఎదురు దెబ్బలు తగిలాయి. మహేష్ అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, ఇప్పుడు తండ్రి కృష్ణ ఇలా ఒకరి తర్వాత ఒకరు మహేష్ కు దూరమయ్యారు.


తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత మహేష్ బాబు తొలిసారి స్పందించారు. కృష్ణ చనిపోయిన తర్వాత మొదటిసారి మహేష్ బాబు స్పందించారు. తండ్రిని తలుచుకుంటూ మహేష్ ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. “మీరు మీ జీవితాన్ని ఆనందంగా గడిపారు. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు… ధైర్యంగా , చురుకైన స్వభావం మీది. నా స్పూర్తి… నా ధైర్యం.. అవన్నీ ఒక్కసారిగా పోయాయి. కానీ విచిత్రమేమిటంటే, నేను ఇంతకు ముందెన్నడూ లేని శక్తిని నాలో అనుభవిస్తున్నాను.. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను.. అచ్చం మీలాగే.. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది… నీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను.. నిన్ను మరింత గర్వపడేలా చేస్తాను… లవ్ యూ నాన్నా… మై సూపర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు మహేష్.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ లేదా మెగాస్టార్.. హీరోయిజం కోసం బీజేపీ తాపత్రయం !

మలయాళం రీమేక్ తో నాగార్జున ?

‘యశోద’ కి ఓటీటీ చిక్కు ?

- Advertisement -