మహేష్ … ‘స్పైడర్’ వాయిదా

242
Mahesh Spyder release date postponed
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’. క్లైమాక్స్‌, రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి చిన్న వార్తైన టీ టౌన్‌లో హల్ చల్ చేస్తోంది. సినిమా ఫస్ట్ లుక్‌ దగ్గరి నుంచి చిన్న క్లూ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్న చిత్ర టీం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఇక తొలుత ఈ సినిమా జూన్‌ 23న విడుదలవుతుందని అంతా భావించారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా మహేష్ బర్త్ డే ఆగస్టు 9కి వాయిదా పడ్డట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మహేష్ అభిమానులకు షాకిచ్చారు చిత్ర నిర్మాతలు. స్పైడర్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్.

Mahesh Babu's SPYder Release Confirmed
ప్రస్తుతం చెన్నైలో క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ను షూట్‌ చేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీతో క్లైమాక్స్‌ షెడ్యూల్‌ ముగుస్తుంది. తర్వాత బ్యాలెన్స్‌ రెండు సాంగ్స్‌ షూట్‌ చేయడం కోసం ఫారిన్‌ వెళతారు. షూటింగ్‌ ఫాస్ట్‌గా పూర్తయినా… పోస్ట్‌ ప్రొడక్షన్‌ అండ్‌ గ్రాఫిక్‌ వర్క్స్‌కి ఎక్కువ టైమ్‌ కావాలని దర్శకుడు ఏఆర్‌ మురుగుదాస్‌ అడిగారట.

ఈ సినిమా కోసం దెబ్బ తిన్న పులిలా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ముందు వచ్చిన బ్రహ్మోత్సవం పూర్తిగా నిరాశ మిగిల్చింది దానితో మొత్తం ఆశలు అన్నీ స్పైడర్ పైన పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదల ఆలస్యం అవుతుండటం పై మహేష్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

Mahesh Babu's SPYder Release Confirmed
సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఠాగూర్‌ మధు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

- Advertisement -