మహేష్‌కి భయపడుతున్న బన్ని..?

179
- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమాలంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. డిఫరెంట్ కథా చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే బన్నీ సరైనోడు బ్లాక్ బస్టర్‌ హిట్‌ను తనఖాతాలో వేసుకున్నాడు. తర్వాత గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే.. దువ్వాడ జగన్నాథంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ అంచనాలతో వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌.
 Mahesh Spider Vs Bunny Dj
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ తేదీ `స్పైడ‌ర్‌` రిలీజ్‌ని బ‌ట్టి ఫిక్స్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి రంజాన్ సెల‌వుల్ని పుర‌స్క‌రించుకుని రావాలని డీజే ట్రై చేస్తున్నా.. ఆ తేదీని మ‌హేష్ లాక్ చేసేశాడు. జూన్ 23న స్పైడ‌ర్ రిలీజ్ ఉంద‌ని ప్ర‌క‌టించారు కాబ‌ట్టి డీజే సందిగ్ధంలో ఉన్నాడు.

ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం స్పైడ‌ర్ బ్యాలెన్స్ వ‌ర్క్ చాలానే ఉంది. జూన్ 23న ఈద్‌ కానుక‌గా రిలీజ‌వ్వ‌డం కుద‌ర‌క‌పోవ‌చ్చ‌న్న వార్త‌లొస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే డీజే ఇప్ప‌టికే ఆ తేదీపై క‌న్నేసి ఉన్నాడు కాబ‌ట్టి సైలెంటుగా వ‌చ్చేయ‌డం ఖాయం అని తెలుస్తోంది.
 Mahesh Spider Vs Bunny Dj
రెండు భారీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయ‌డం కంటే గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయ‌డం మంచిది కాబ‌ట్టి డీజే కాస్త ఆలోచిస్తున్నాడు. అయితే మ‌హేష్ సైతం రంజాన్ సెల‌వుల్ని వ‌దులుకునే ఆలోచ‌న‌లో అయితే లేడు. అందుకే సినిమాని త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేయ‌మ‌ని మురుగ‌దాస్‌ని తొందరపెడుతున్నట్టు కూడా తెలుస్తోంది.

అలాగే డీజే సైతం క్లీన్‌క‌ట్‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకునే స‌న్నివేశంలో లేద‌ని చెబుతున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కు స‌మ‌యం ప‌ట్ట‌నుంది. కొన్నిచోట్ల అవ‌స‌రాన్ని బట్టి రీషూట్‌లు కూడా చేస్తున్నార‌ని టాక్‌. ఇక‌పోతే స్పైడ‌ర్ కోసం రెండు పాటలు, భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ చిత్రీక‌రించాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ ఇద్దరి స్టార్లలో ఏ స్టార్‌ ముందుగా ఆడియెన్స్‌ ముందుకొస్తాడో చూడాలి.

- Advertisement -