అనిల్‌తో మరోమూవీ చేస్తా: మహేష్ బాబు

394
mahesh
- Advertisement -

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడారు మహేష్.

సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నానని…. బొమ్మ దద్దరిల్లిపోద్ది అన్నారు. బిజినెస్‌మేన్‌ తర్వాత త్వరగా షూటింగ్ పూర్తిచేసిన సినిమా ఇదన్నారు. 125 రోజుల్లో మా యూనిట్‌ రెస్ట్‌ లేకుండా కంటిన్యూగా వర్క్‌ చేశారన్నారు.

అనిల్‌ రావిపూడితో సినిమా చేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అని..త్వరలోనే మరో సినిమా చేస్తానని చెప్పారు. ఏ కథలో అయిన ఎంటర్‌టైన్మెంట్‌ను జొప్పించటం అనిల్‌ రావిపూడి బలం. ఆర్మీ ఆఫీసర్‌ సబ్జెక్ట్‌ తీసుకొచ్చి దానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ మిక్స్‌ చేసి సినిమా అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు.ఇప్పటివరకు అనిల్ తీసిన సినిమాల్లో ఇది డిఫరెంట్ అన్నారు.

విజయశాంతి గారితోతో `కొడుకు దిద్దిన కాపురం` సినిమా చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫ్లైట్‌లో కలిశాం కానీ ఒక షాట్‌ చేయగానే ‘కొడుకు దిద్దిన కాపురం’ షూటింగ్‌ నిన్ననే జరిగినట్లు అన్పించిందన్నారు.

- Advertisement -