Sudheer:’హరోం హర’ పవర్ ఫుల్ ట్రైలర్

6
- Advertisement -

విభిన్న కథలని ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటున్న హీరో సుధీర్ బాబు తన అప్ కమింగ్ మూవీ ‘హరోం హర’లో మరొక కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన మేకర్స్, సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ ని లాంచ్ చేశారు.

ట్రైలర్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. హరోం హర స్క్రీన్ పైకి ఏం తీసుకువస్తుందో చూడాలని ఎదురు చూస్తున్నాను! ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది! సుధీర్‌బాబు అండ్ టీమ్ కు శుభాకాంక్షలు’ తెలియజేశారు. బ్లాక్ బస్టర్స్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, సంపత్ నంది ముఖ్య అతిధులుగా హాజరైన ట్రైలర్ లాంచ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

ఆయుధాల ప్రాముఖ్యత గురించి సునీల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989 నాటి కథ ఇది. జీవితంలో ఎలాంటి పురోగతి లేని, సంతృప్తి చెందని సుబ్రహ్మణ్యంకు ఒక సువర్ణావకాశం లభిస్తుంది. గన్స్ దొరకనప్పుడు అతను గన్ స్మిత్ అవుతాడు. సిటీలో హింసాత్మక ఘటనలు పెరగడంతో పోలీసులు గన్ స్మిత్ వెంట పడతారు.

ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతంగా వుంది. జ్ఞానసాగర్ ద్వారక యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. గన్ మేకింగ్ కాన్సెప్ట్ టాలీవుడ్ కి కొత్త. ఆయన రైటింగ్ ఎంత గొప్పదో ఆయన దర్శకత్వం కూడా అంతే అద్భుతంగా వుంది. డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి. సుధీర్ బాబు తన పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. కుప్పం యాసలో, డైలాగ్ డెలివరీ, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ బిగ్గెస్ట్ అసెట్స్. సునీల్‌కు మంచి పాత్ర లభించింది. అతని ప్రజెన్స్ గ్రేట్ వాల్యు ని యాడ్ చేసింది. సుధీర్ బాబుకు జోడిగా మాళవిక శర్మ తన పాత్రను చక్కగా పోషించింది.

టెక్నికల్‌గా సినిమా చాలా బ్రిలియంట్ గా వుంది. అరవింద్ విశ్వనాథన్ క్యాప్చర్ చేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ తన ఎక్స్ ట్రార్డినరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎలివేషన్స్ ఇచ్చాడు. SSC బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్-క్లాస్ లో వున్నాయి. టీజర్, పాటలు, ఇతర ప్రమోషన్‌లు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పగా, ట్రైలర్ అంచనాలని రెట్టింపు చేసింది. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్. భారీ అంచనాలతో జూన్ 14న హరోం హర ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:KTR: చార్మినార్ గుర్తును తొల‌గిస్తారా?

- Advertisement -