‘రాజమౌళి – మహేష్’ సినిమా.. కొత్త ముచ్చట్లు

29
- Advertisement -

మిక్స్డ్ టాక్‌తోనే ‘గుంటూరు కారం’కు మంచి వ‌సూళ్ళు తెస్తున్న మ‌హేష్ బాబు త‌న త‌ర్వాతి సినిమాను రాజ‌మౌళితో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఆస్ట్రేలియా అడ‌వుల నేప‌థ్యంలో సాగ‌నున్న ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్‌ రెడీ అయ్యింద‌ని, అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసం అదిరిపోయే క్యారెక్టర్ ను డిజైన్ చేశాడని, పైగా మహేష్ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ లను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పై క్రేజీ విషయాలు చెప్పారు. ‘ఇప్పటికే, ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యింది. మహేష్ పాత్ర అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా మహేష్ బాబు పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అలాగే, భారీ ఎమోషన్స్ కూడా ఉంటాయి’ అని రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, ఒక్కసారి స్క్రిప్ట్ పూర్తయితే రాజమౌళి డ్యూటీ ఎక్కేసినట్లేనని టాక్ ఉంది.

ఇదిలా ఉంటే జక్కన్న సినిమా అంటే హీరోలు కనీసం 3 ఏళ్ళు లాకై పోయినట్లే అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో మహేశ్ బాబు కూడా మూడేళ్లు కేటాయించనున్నాడు. అయితే, ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయమని రాజమౌళి.. మహేష్‌కి చెప్పినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మహేష్ బాబు జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నట్లు టాక్. ఇంతకు ముందు ‘వన్’ సినిమాలో సిక్స్ ప్యాక్‌ని ట్రై చేసిన మహేష్.. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read:Ram Mandir:తరలిరానున్న ప్రముఖులు వీళ్లే

- Advertisement -