అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ అటెన్షన్‌ని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. తొలి సినిమాతోనే టాలీవుడ్‌ని షేక్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు అతీతంగా సినిమాపై ప్రశంసలు గప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ సత్తాచాటింది అర్జున్ రెడ్డి.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ అర్జున్ రెడ్డి విజయం ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ఈ సినిమా చూసిన తరువాత తనకి ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు ఫోన్ చేసి అభినందించారని అన్నాడు. తర్వాతి సినిమా ఏదైనా తాము నిర్మిస్తామంటూ చాలామంది నిర్మాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా మహేశ్ బాబు ఫోన్ చేసి అభినందించడం తనకి ఎంతో ఆనందంగా అనిపించిందని అన్నాడు. వీలు చూసుకుని ఒక సినిమా చేద్దామని మహేశ్ బాబు అనడం తనని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పాడు. మహేశ్ బాబుతో సినిమా చేయాలనే కోరిక తనకి ఎప్పటి నుంచో ఉందనీ, ఆ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు.
తన తర్వాతి సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగుతుందని అంటుదని తెలిపారు. ఈ సినిమా పేరు ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనీ .. .తానే నిర్మాతగా వ్యవహరిస్తానన్నారు.