దీపాదాస్‌పై తప్పుడు ప్రచారం సరికాదు!

17
- Advertisement -

దేశంలోని పలు రాష్ట్రాలకు ఇంఛార్జీలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జీగా మీనాక్షి నటరాజన్‌ను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.

దీపాదాస్ మున్షీపై తప్పుడు ప్రచారం జరుగతున్న నేపథ్యంలో దానిని ఖండించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీపాదాస్ మున్షీ నిబద్ధత, క్రమశిక్షణ గల నాయకురాలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి కేరళలో పూర్తి బాధ్యతలతో పనిచేయాల్సి ఉన్నందున ఇక్కడ కొత్త నియామకం జరిగిందే తప్ప ఎలాంటి చర్యలు కావు అని తేల్చిచెప్పారు. ఆమెపై వచ్చిన వార్తలను ఖండిస్తున్నాం. నిరాధార వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

కొన్ని దినపత్రికలు, ప్రసార మాద్యమాలలో దీపాదాస్ ముంన్షి పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసారని ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవం అన్నారు. కేరళ ఏఐసీసీ ఇంచార్జ్ గా ఉంటూ తెలంగాణ లో ఏడాది కాలం పాటు అదనపు బాధ్యతలు నిర్వహించారు అన్నారు.

Also Read:ఇకపై ఉచిత ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉండవు!

- Advertisement -