కిషన్ రెడ్డిపై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

11
- Advertisement -

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం అన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌. రాష్ట్ర అభివృద్ధిలో ఒక తెలంగాణ బిడ్డగా తన వంతు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరితే ఆయన బాధ్యతా రాహిత్యంగా తప్పించుకునేలా మాట్లాడుతున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డా..? నేనా..? అంటూ వ్యాఖ్యానించారు. మతచిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదు. పరమత సహనంతో మెలిగే తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అనే మాటను ప్రజలు కలలో కూడా ఊహించలేరు. అవన్నీ పగటి కలలే అన్నారు.

కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ తెలంగాణ బిడ్డలుగా రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేయాలని కోరితే పెడర్థాలు తీస్తున్నారు.

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పదేళ్లలో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు ఎన్ని కేటాయించింది..? ఎన్ని ప్రాజెక్టులు కేటాయించింది..? రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రాజెక్టులు, సంస్థలకు ఎందుకు మెకాలడ్డుతోంది..? వీటిపై చర్చించేందుకు తెలంగాణ బీజేపీ సిద్దమా..? అని సవాలు విసురుతున్నాం అన్నారు.

Also Read:AP Budget 2025-26: ఏపీ బడ్జెట్ హైలైట్స్

- Advertisement -