అద్భుతంగా ప్రజాపాలన:పీసీసీ చీఫ్

7
- Advertisement -

రాష్ట్రంలో అద్భుతమైన పాలన ఉందన్నారు పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల మంత్రి వర్గం అద్బుతమైన ఆలోచనలతో పథకాలు, కార్యక్రమాలతో ముందుకెలుతున్నారని తెలిపారు.

దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా చేస్తున్నామన్నారు. గ్రామాలలో ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్ని..స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయాలకు ప్రయత్నించాలని కోరారు.

రైతు భరోసా ఒక మంచి కార్యక్రమం ఇది గతంలో ఎన్నడూ లేని విదంగా 9 రోజులలో 9 వేల కోట్లు రైతులకు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రైతు రుణమాఫీతో సహా కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేసిందని తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన జైబాపు జై భీమ్ సంవిధాన్, సంస్థాగత నిర్మాణం తదితర కార్యక్రమాలను రాష్ట్రంలో చాలా బాగా అవుతున్నాయని ఏఐసీసీ నేతలు అభినందించారని తెలిపారు.

Also Read:చిరు అమ్మకి అనారోగ్యం..వదంతులే!

- Advertisement -