కొండా వివాదానికి ముగింపు పలకండి:మహేశ్‌ కుమార్

5
- Advertisement -

మంత్రి కొండా సురేఖ వివాదానికి ముగింపులకాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్. సినీ పెద్దలారా మీకు దండం పెడతాం ఇక ఆపేయండని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండని సూచించారు.

మంత్రి కొండా సురేఖ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు ఐఏఎస్ స్మితా సబర్వాల్. ప్రజల దృష్టిని ఆర్షించేందుకు, సంచలనం అయ్యేందుకు మహిళలను టార్గెట్ చేయడం బాధాకరం అన్నారు. అధికారులను కూడా వదిలిపెట్టడం లేదు.. వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను అని తెఇపారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళపై మీ వ్యాఖ్యలు సరికాదు,,,తరచూ నటులను, వారి కుటుంబాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు. రాజకీయ లాభాల కోసం నిరాధార ఆరోపణలు చేయడం బాధ, నిరాశ కలిగిస్తోందన్నారు. నటులుగా ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉంటాం.. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం అన్నారు. తమ కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం, వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేయడం వంటివి ఎవరూ ఇష్టపడరు అని చెప్పుకొచ్చారు.

Also Read:వార్తల్లో నిలిచేందుకు అసత్య ఆరోపణలా:చిరు

- Advertisement -