రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తిగా ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ఈనెల 9న కులగణన సదస్సుకు హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో, నాతో విడివిడిగా మాట్లాడారని తెలిపారు. ఈ నిర్ణయంతో మీరు రోల్‌మోడల్ కాబోతున్నారని చెప్పారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటున్నానని.. తమ ప్రభుత్వం ఇందిరాగాంధీ విధానమే అనుసరిస్తున్నామని వెల్లడించారు.
ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ బీఆర్ఎస్ 15 వేల ఎకరాలు సేకరించడం వల్ల విపరీతమైన కాలుష్య, ట్రాఫిక్ సమస్యలు వస్తాయని కాంగ్రెస్ ఆనాడే చెప్పిందన్నారు. ఫార్మాసిటీని ఎందుకు హైదరాబాద్ పక్కనే పెట్టాలి? కొడంగల్, భద్రాచలం, ములుగు వంటి ప్రాంతాల్లో పెట్టి అభివృద్ధి చేయవచ్చునని అన్నారు. హైడ్రా అనేది హైదరాబాద్ నగరానికి వరం లాంటిదన్నారు. హైదరాబాద్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని కొనియాడారు.
Also Read:ధర్మం కోసం పోరాడుతాం: పవన్