మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

21
- Advertisement -

‘గుంటూరు కారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ‘‘సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండుగ. మా సినిమా సంక్రాంతికి రిలీజైతే హిట్టే. నా సినిమా రిలీజ్ కాగానే నాన్న ఫోన్ కోసం ఎదురుచూసేవాడిని. కానీ ఈసారి ఆయన లేరు. నా సినిమా ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇకపై మీరే నాకు అమ్మా, నాన్న’’ అంటూ మహేష్ ఎమోషనల్ అయ్యారు. అలాగే మహేష్ ఇంకా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ముఖ్యంగా హీరోలందరికీ తాట ఊడిపోతుంది అన్నారు. శ్రీలీల గురించి చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “లీల.. చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్ అవ్వడం. చాలా డేడికేటెడ్ గా ఉంటుంది. షాట్ ఉన్నా లేకున్నా అక్కడే ఉంటుంది. మేకప్ వ్యాన్ లోకి వెళ్ళదు. ఇక ఆమెతో డ్యాన్స్ అంటే.. వామ్మో.. అదేం డ్యాన్స్.. హీరోలందరికీ తాట ఊడిపోతుంది. కానీ, ఆమెతో వర్క్ చేయడం చాలా బావుంది.” అని మహేష్‌ బాబు అన్నారు.

మరోవైపు మహేష్‌ కలెక్షన్ల తాట తీస్తాడు అంటూ దిల్‌ రాజు కూడా క్రేజీ స్పీచ్ ఇచ్చాడు. ‘కుర్చీ మడత పెట్టి సాంగ్ సినిమాలో హైలైట్‌ గా ఉంటుంది. ఆ పాటకి మహేష్‌, శ్రీలీల చేసే డాన్సులకు స్క్రీన్లు చిరిగిపోతాయి. మహేష్‌ ఈ సినిమాతో కలెక్షన్ల తాట తీస్తాడు. త్రివిక్రమ్‌ తన ప్రతి సినిమాతో ఏదో మాయ చేస్తారు. ఈ సంక్రాంతికి త్రివిక్రమ్‌ మనకు వదులుతున్న గుంటూరు కారమే మన మహేష్‌’ అని చెప్పారు.

Also Read:శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు..

- Advertisement -