సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సమర్ధుడైన, మంచి దర్ళకుడు త్రివిక్రమ్ అందించే పీరియాడిక్ మాస్ యాక్షన్ సినిమా ఇది. అన్నింటికన్నా ముందుగానే ఈ చిత్రాన్ని మహేష్ – త్రివిక్రమ్ స్టార్ట్ చేశారు. కానీ పక్క హీరోల సినిమాలు ‘గుంటూరు కారం’ సినిమాని దాటుకుంటూ వెళ్లి విడుదలైపోతున్నాయి. మరికొన్ని విడుదలకు సిద్దం అవుతున్నాయి. వాటికీ, ఈ ‘గుంటూరు కారం’ సినిమాకు కీలకమైన తేడా ఒకటే. అక్కడ దర్శకుడు చెబితే హీరోలు వింటారు. కానీ ఇక్కడ రివర్స్. హీరో చెబితే దర్శకుడు వినాలి.
ఈ సినిమాకు మహేష్ బాబు పెద్దగా కష్టపడక్కరలేదు. అసలు అలా అలా వచ్చి అప్పుడప్పుడు షూట్ చేస్తే సరిపోతుంది. ఈ సినిమాకు రోజుల తరబడి షూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. విషయం ఏమిటంటే ఈ సినిమా ఒప్పుకున్న నాటి నుంచి త్రివిక్రమ్ చెప్పేది ఎందుకో మహేష్ కి కనెక్ట్ కావడం లేదు. గతంలో అనేక సినిమాలు చేసిన మాదిరిగానే ఈ సినిమా చేయడానికి మహేష్ ఓకే అన్నారు. కానీ ఈ సినిమా తర్వాత మహేష్ – రాజమౌళి కలయికలో సినిమా రాబోతుంది. సో.. ఆ సినిమాని దృష్టిలో పెట్టుకుని మహేష్ ఈ సినిమా విషయంలో పూర్తి కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు.
Also Read:సనాతన ధర్మం అంటే ఇదేనా..మోడీజీ!
స్క్రిప్ట్ అద్భుతంగా వస్తేనే చేస్తాను, లేదు అంటే చేయను అంటూ ఇన్నాళ్లు మహేష్ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ సినిమా మేకర్స్ లో టెన్షన్ మొదలు అయ్యింది. అనుకున్న డేట్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ అవుతుందా ?, ఆల్ రెడీ మహేష్ ఈ సినిమా షూటింగ్ ను నాలుగైదు సార్లు పోస్ట్ ఫోన్ చేశాడు. మరి చివరకు ఈ సినిమా ఎన్నాళ్ళు ఆగుతూ సాగుతుందో చూడాలి. గుంటూరు నేపథ్యంలో భారీ యాక్షన్ కథతో తెరకెక్కుతోంది ఈ గుంటూరు కారం సినిమా.
Also Read:ప్చ్.. ప్లాప్ కాంబినేషన్ పై భారీ బడ్జెట్?