టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత శ్రీమంతుడు లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ తన 24వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి భరత్ అనే నేను అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు కొరటాల. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11, 2018న విడుదల చేయనున్నారు. త్వరలోనే చిత్రయూనిట్‌తో మహేష్ చేరే అవకాశం ఉంది.
ఈ మూవీలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. గతంలో దూకూడులో ఎమ్మెల్యేగా నటించి మెప్పించిన మహేష్ అదే ఫార్ములాను అనుసరించి పొలిటికల్ టచ్ ఉన్న సినిమా చేస్తున్నాడట. అయితే గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌తో దర్శనం ఇస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, నేనొక్కడినే సినిమాల్లో ఒకే తరహా లుక్‌లో కనిపించిన మహేష్ .. ‘భరత్ అను నేను’మూవీలో ఏపీ సీఎం చంద్రబాబు ట్రేడ్ మార్క్ గెడ్డంను రిఫరెన్స్‌గా తీసుకుని ఆ విధంగా కనిపిస్తున్నట్టు సమాచారం.
ఈ లుక్‌కోసం మహేష్ …చంద్రబాబు తరహాలో గడ్డం పెంచుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు డ్రెస్సింగ్ స్టైల్కూడా మార్పు చేశారట. ఇటీవల మహేష్ పెంచిన గెడ్డంతో ఫోటో షూట్ నిర్వహించాడట చిత్ర దర్శకుడు కొరటాల. అయితే సినిమాలో మహేష్ లుక్ చాలా కీలకం కావడంతో ఆఫోటో లు ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారట. యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చినా ఇంకా ఫైనల్ కాలేదు.