మహేష్ బాబుతో గీతా ఆర్ట్స్ మూవీ..!

197
Mahesh Allu Aravind

టాలీవుడ్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే అతికొద్ది నిర్మాణ సంస్ధల్లో అల్లు అరవింద్ సంస్థ గీతా ఆర్ట్స్ ఒకటి. చాలాకాలం తర్వాత ఓ అగ్రహీరోతో సినిమా చేసేందుకు గీతా ఆర్ట్స్ సిద్ధమైంది.  ప్రిన్స్ మహేష్ బాబుతో త్వరలో గీతా ఆర్ట్స్ సినిమాను తెరకెక్కించనుంది.  ఇప్పుడు ఇదే వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇటీవల సూపర్ స్టార్‌ని ఓ ఫంక్షన్‌లో కలుసుకున్న అరవింద్ తన మనసులోని మాటను బయటపెట్టాడని సమాచారం. దీనికి మహేష్ కూడా సానుకూలంగా స్పందించాడట. సరైన కథ దొరికితే గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మహేష్ మూవీ పట్టాలెక్కడం ఖాయం.

మ‌హేశ్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పూజాహెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తుంది. పవన్‌తో జల్సా సినిమా తర్వాత అగ్రహీరోతో గీతా ఆర్ట్స్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. గతంలో అల్లు అరవింద్ బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్‌తో గజనీ సినిమా చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.