మహేష్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

7
- Advertisement -

మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఒక షెడ్యుల్ కంప్లీట్ అయింది. రెండు షెడ్యుల్ ఈ నెలాఖరు నుండి మొదలు కాబోతుంది. ఈ షెడ్యుల్ కోసం హైదరాబాద్ శివారులో ఓ రిచ్ హౌజ్ సెట్ వేసారు. అందులోనే సీన్స్ తీయబోతున్న. పూజ హెగ్డే కూడా ఈ షెడ్యుల్ లో జాయిన్ అవ్వబోతుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ ఎనౌన్స్ చేయలేదు. అ అక్షరం తో త్రివిక్రమ్ టైటిల్ అనుకుంటున్నారని కొన్ని నెలలుగా చాలా టైటిల్స్ వినిపిస్తున్నాయి. కానీ అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా త్రివిక్రమ్ అండ్ టీమ్ టైటిల్ ఫిక్స్ చేసుకున్నారట. టైటిల్ తో పాటు మహేష్ లుక్ తో మార్చ్ 22న ఉగాదికి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. మేకింగ్ వీడియో లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

మరి ఇందులో మహేష్ లుక్ ఎలా ఉండనుంది ? అసలు ఈ క్రేజీ కాంబో సినిమాకు ఏ టైటిల్ పెట్టనున్నారు? అనేది తెలియాలంటే ఉగాది వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి…

పెద్ద గండం తప్పించుకున్న సూర్య, విశాల్!

ఆ నటితో బీరు తాగించారట

చరణ్‌ను ప్రమోట్ చేస్తున్న చిరంజీవి

- Advertisement -