ప్రధాని మోదీని గద్దె దించాలంటే సీఎం కేసీఆర్ తోనే సాధ్యం అన్నారు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల. ఆస్ట్రియాలో ఎన్నారైలతో సమావేశమైన ఆయన…దేశంలో ప్రత్యామ్నాయ పార్టీ కి ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలని…మిషన్ భగీరథలాగా ప్రతి రాష్ట్రం లో ఇంటిటికి తాగు నీరు రావాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే శక్తి ఒక్క కేసీఆర్ కే ఉన్నదని ఉత్తర భారత ఎన్నారైలు భావిస్తున్నారని మహేష్ బిగాల అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రియా కార్యవర్గం మరియు వివిధ రాష్ట్రాల ఎన్నారైలు పాల్గొన్నారు. అనుమాండ్ల లక్ష్మారెడ్డి, బొల్లాడి లక్ష్మారెడ్డి, సంతోష్, కంది వంశీ, కోరండ్ల ప్రవీణ్, రంగు మహేష్, దోర్నాల సంతోష్, శ్రీనివాస రావు, రమేష్, శ్రీనివాస్, అశోక్, భరత్, సత్యజిత్, రూపేష్ జైస్వాల్ మరియు ఇతరులు పాల్గొన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ ఆస్ట్రియా కొత్త కార్యవర్గం ప్రకటిస్తామన్నారు.