125 కోట్ల క్లబ్‌లో మహేష్‌..

208
mahesh Bharat Ane Nenu collections
- Advertisement -

ప్రిన్స్ మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. పూర్తిస్ధాయి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుని హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు కొల్లగొట్టిన భరత్ అనే నేను…తాజాగా 125 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకు బాహుబలి పేరుతో ఉన్న రికార్డులను తిరగరాసింది.

125 కోట్లు వసూలు చేయడం ఆనందంగా ఉందని తెలిపిన చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. పోస్టర్‌లో మహేష్ పంచకట్టుతో ఆకట్టుకోగా రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బ్రేక్ చేయనుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

మరోవైపు సినీ ప్రముఖులు కొరటాల శివ దర్శకత్వం -మహేష్ నటనకు ఫిదా అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం మహేష్ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఒక కమర్షియల్ సినిమాలో లోకల్ గవర్నెన్స్ వంటి అంశాన్ని ప్రస్తావించడమనేది కొరటాల గొప్పతనం. ఈ సినిమాలో ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్ చాలా అద్భుతంగా ఉంది అని ప్రశంసించారు.

ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్‌తో నటిస్తున్నారని వార్తలు వెలువడిన అవన్నీ పుకార్లేనని తెలిపోయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసే సినిమాకు కమిట్ అయ్యారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా త్వరలో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మహేష్.

- Advertisement -