కోలీవుడ్‌లోకి మహేష్ గ్రాండ్ ఎంట్రీ

197
mahesh-babus-spyder-audio-launched
mahesh-babus-spyder-audio-launched
- Advertisement -

మహేశ్ బాబు, ఎ.ఆర్‌ మురుగదాస్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేష‌న్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న సినిమా ‘స్పైడర్‌’ . ఈ సినిమా ఆడియో విడుదల కార్య‌క్ర‌మాన్ని చెన్నైలో ఘనంగా నిర్వహించారు. స్పైడర్ సినిమా తమిళ వ‌ర్ష‌న్ పాటలతో పాటు తెలుగు పాట‌ల‌ను కూడా అక్కడే విడుదల చేశారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ భగవంతుడు తెలుగులో కోట్లాది మంది అభిమానులను ఇచ్చాడని, అక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను సంపాదించుకున్నానని, ఈ జన్మకు ఇది చాలన్నాడు. తమిళంలో సినిమాలు చేయడం లేదనే కొరత లేదని, ఇప్పుడీ చిత్రంతో 18 ఏళ్ల తర్వాత మళ్లీ నేను నటుడిగా పరిచయమవుతున్నట్టుందని చెప్పాడు. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాషల్లో సినిమా చేయడం మామూలు విషయం కాదన్న మహేష్.. దర్శక, నిర్మాతలు ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమా చేశారని అన్నాడు.

9brk124-spyder

అలాగే తమిళంలో సూపర్ హిట్ సినిమా ‘తుపాకి’ చూసిన వెంటనే దాన్ని రీమేక్ చేయాలని అనుకున్నానని, కానీ కుదరలేదన్నాడు మహేష్. తుపాకిలో విజయ్ చెప్పిన ‘ఐయామ్ వెయిటింగ్’ అన్న డైలాగ్ తనకెంతో ఇష్టమన్న మహేష్‌.. స్పైడర్ లో పోషించిన పాత్ర తన మనసుకు ఎంతో దగ్గరైందని అన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు విశాల్ మాట్లాడుతూ, మహేశ్ కు కోలీవుడ్ లోకి స్వాగతం పలికేందుకే తాను ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చానని, అభిమానులతో పాటు తాను కూడా ఆసక్తిగా చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. కాగా, ఈ వేడుక‌కు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మ‌హేశ్ బాబు అభిమానులు త‌ర‌లివెళ్లారు. ఆ ప్రాంగ‌ణంలో మ‌హేశ్ బాబు భారీ క‌టౌట్లు కనబడ్డాయి.

- Advertisement -