టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుకు జీఎస్టీ అధికారులు మరోసారి భారీ షాకిచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏయంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ థియేటర్స్ లో సినిమా చూడాలంటే డబ్బు కూడా అదే స్థాయిలో ఖర్చు పెట్టాల్సిందే. తాజాగా ఈ మల్టీప్లెక్స్‌కు జీఎస్టీ అధికారులు నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై ఆ షోకాజ్ నోటీసు జారీ అయినట్టుగా తెలుస్తోంది.
మహేష్‌బాబుకు చెందిన 7 స్కీన్ల సూపర్‌ప్లెక్స్ ఏఎంబీ థియేటర్‌లో పాత జీఎస్టీ రేట్లకే టికెట్లు విక్రయించడంతో కేసు నమోదు చేశారు. జీఎస్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. జీఎస్టీ తగ్గించినా.. పాత జీఎస్టీ రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి అక్రమంగా రూ.30లక్షలు వసూలు చేశారు. ఏఎంబీ థియేటర్‌పై కేసు నమోదు చేసిన జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
గతంలో కూడా ట్యాక్స్ చెల్లించకపోవడంతో మహేష్‌బాబుకు చెందిన రెండు బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే మహేష్‌పై 2007-08 నాటి సర్వీస్ ట్యాక్స్ వివాదంపై కోర్టులో విచారణ జరుగుతోంది.