మహేష్ బాబు గ్లామర్ రహస్యం ఇదే..!

445
- Advertisement -

వయసు పెరుగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా కుర్రాడిలా కనిపిస్తూ ఉంటారు. మరి ఆయన ఏదైనా హెల్త్ టిప్స్ ఫాలో అవుతున్నారా..? లేక మరేదైనా రహస్యం ఉందా..? ఈ ప్రశ్నలకు మహేష్ సమాధానం ఇచ్చారు. సాధారణంగా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్లకు వెళ్తూంటారు. షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చి మరీ ఆయన ట్రిప్స్ ని ఎంజాయ్ చేస్తూంటారు. రీసెంట్ గా ఆయన తన ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్ కి వెళ్ళి వచ్చిన విషయం తెలిసిందే.

Mahesh Babu's Glamour...

అయితే మరోసారి ఆయన షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి మలేషియా ట్రిప్ కు వెళ్ళబోతున్నారట. అయితే ఇది మాత్రం ఫ్యామిలీతో కాదట. కేవలం ఇది ఓ హెల్త్ ట్రిప్ అని టాక్. ప్రతి ఏడాది ప్రిన్స్ తన బాడీని డీటాక్సినేషన్ చేయించుకుంటారట. అంటే శరీరంలో పనికారని వ్యర్ధాలను తొలగించే ప్రక్రియ అన్నమాట. దీనికోసమే ఆయన మలేషియా వెళ్లబోతున్నారని టాక్. మరి తన హెల్త్ విషయంలో ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటారన్నమాట. అందుకేనేమో మహేష్ ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్ లా ఉంటారు.

- Advertisement -