మహేష్‌ కూతురే గెలిచిందన్న సమంత..!

215
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార తన ముద్దు ముద్దు మాటలతో అందరిని కట్టిపడేస్తోంది. మహేష్ తనయుడు గౌతమ్ నేనొక్కడినే మూవీతో తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు ప్రిన్స్ ముద్దుల కూతురు సితార వంతు వచ్చేలానే కనిపిస్తోంది. తాజాగా మహేష్ – సమంత నటించిన బ్రహ్మోత్సవం సినిమాలోని ఓ డైలాగును సితార కూడా ముద్దుముద్దుగా పలికింది.ఇంతకీ ఆ డైలాగు ఏంటో తెలుసా.. ”ఏడు తరాలా.. వెతికితే దొరకనంత మందా.. కలిస్తే వదులులేకోనంత మందా అంటూ సమంత బ్రహ్మోత్సవంలో హీరో ఫ్యామిలీ గురించి చెబుతుంది.

సితార కూడా తన ముద్దుముద్దు మాటలతో అదే డైలాగును రిపీట్ చేసింది. సితార ఆ డైలాగు చెప్పిన తీరుకు సమంతతో పాటు మహేష్ అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ఈ విషయాన్ని మహేష్ అభిమాని ఒకరు ట్వీట్ చేయగా.. తామిద్దరిలో పోటీ అన్నది లేనే లేదని, సితారే గెలిచిందని చెప్పింది సమంత. క్యూట్‌గా ఉండే సితార అంటే మహేష్ అభిమానులతో పాటు సమంతకు కూడా చాలా ఇష్టం. ఇటీవల సమంత, సితార మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. సమంత, సితారతో సరదాగా కాలక్షేపం చేయడంతో పాటు బొమ్మలు కూడా కొనిస్తుంది. మొత్తానికి సితార టాలెంట్ చూసినవాళ్లంతా.. వెండితెరపై బాలనటిగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ముచ్చటించుకుంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో మరీ.

- Advertisement -