తమిళంలో విడుదలకు సిద్దమైన భరత్ అనే నేను..

246
Mahesh Babu’s Bharat Ane Nenu to release in Tamil
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. కథానాయికగా కైరా అద్వానీ నటించగా డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. పూర్తి రాజకీయ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాడు.

 Mahesh Babu’s Bharat Ane Nenu to release in Tamil

తెలుగులో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అంచనాలకు తగ్గకుండా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు కురిపించారు. అయితే ఈ మూవీ తమిళ్, మలయాళంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. మ‌హేష్ బాబుకు త‌మిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాను మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు (మే 31) సందర్భంగా తమిళంలో ‘భ‌ర‌త్ ఎనుము నాన్’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఇక ‘భ‌రత్ ఎన్న అంజాన్‌’ అనే పేరుతో మ‌ల‌యాళంలో ఈ మూవీ విడుద‌ల అవుతుండగా రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇవ్వలేదు. తెలుగునట భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -