దిగొచ్చిన మహేష్‌..!

262
asian mahesh
- Advertisement -

ఏషియన్ సినిమాస్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలె ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్‌ థియేటర్‌లో ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా అధికంగా వసూలు చేసినట్లు ఫిర్యాదుల రావడంతో అధికారులు దాడిచేశారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ వరకు పాత జీఎస్టీ ప్రకారమే ప్రేక్షకుల నుంచి వసూలు చేసినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో ఏఎంబీ థియేటర్ యాజమాన్యం దిగొచ్చింది. జీఎస్టీ రూపంలో ప్రేక్షకుల నుండి అదనంగా వసూలు చేసిన రూ. 35 లక్షల 66 వేల రూపాయలను రాబట్టారు జీఎస్టీ అధికారులు. ఈ మొత్తాన్ని సంక్షేమ నిధికి జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, టికెట్ల అంశం రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ పరిధిలో ఉండడం వల్లే జీఎస్టీని తగ్గించలేదని థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది.

కాగా, ఇటీవల కేంద్రప్రభుత్వం సినిమా టికెట్లను 28 శాతం పరిధి నుంచి 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చి వినోద భారాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే.

- Advertisement -