డైరెక్టర్ పూరికి సూపర్ స్టార్ మహేష్‌ బ‌ర్త్ డే విషెస్‌

74
mahesh
- Advertisement -

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ నేడు (సెప్టెంబర్ 28) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్‌ బాబు త‌న సోష‌ల్ మీడియా ద్వారా పూరీ జ‌గన్నాథ్‌కి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. హ్యాపీ బర్త్ డే పూరీ స‌ర్.. సంతోషం, ఆరోగ్యంతో నిండిన నమ్మశక్యంకాని సంబరాల ఏడాదిని గడపండి అంటూ ట్వీట్ చేశారు.

ఇక మహేశ్ – పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ చేయగా, ‘బిజినెస్ మేన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసందే. వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా ‘జనగణమన’ తెరకెక్కాల్సి ఉండగా, ఆ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడింది. పూరి – మహేశ్ కాంబోలో వచ్చే మూడవ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -