బాలయ్యకు మహేష్,వెంకీ,మోహన్ బాబు విషెస్

272
mohan babu
- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ 60వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు, సెల‌బ్రిటీలు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు,వెంకటేష్,మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

నా సోదరుని కుమారుడు నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను అని విష్ చేశారు మోహన్ బాబు.

ఎన‌ర్జీతో నిండిన ప‌వర్ హౌజ్‌.. నేను ఎప్పుడు అభిమానించే వ్య‌క్తి.. బాల‌కృష్ణ‌కి 60వ బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు. మీరు ఎప్పుడు సుఖ సంతోషాల‌తో ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని మ‌హేష్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది మీకు వ్య‌క్తిగ‌తంగాను, వృత్తిప‌రంగాను మంచి క‌లిగించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను . హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్బీకే అని ట్వీట్ చేశారు విక్టరీ వెంకటేష్.

- Advertisement -