మహేష్ బాబు టికెట్లమ్ముతున్నాడు…

351
Mahesh-Babu
Mahesh-Babu
- Advertisement -

థమ్సప్, పారగాన్ , రాయల్ స్టాగ్ , వివెల్ షాంపూ,సంతూర్, జొస్ అలూక్కాస్, ఐడియా… ఇదేం లిస్టు అనుకుంటున్నారా? సూపర్ స్టార్ మహేష్ బాబు చేతిలో వున్న బ్రాండ్ల పేర్లు. ఇప్పుడు ఆయన ఖాతాలో మరో బ్రాండ్ చేరింది. అభిబస్ అనే ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించనున్నాడు మహేష్.

Mahesh Babu will ask to buy bus tickets

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే ఆ యాడ్ షూటింగ్ కూడా రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తైంది. ఇప్పటికే చాలా బ్రాండ్లను తన కిట్టీలో వేసుకున్న మహేష్ …ఈ కొత్త యాడ్ తో మనలని పలకరించటానికి రెడీ అయ్యిపోయాడు. గతంలో మహేష్ బాబుతో ‘అతడు, ఖలేజా’ వంటి చిత్రాలను తెరకెక్కించిన త్రివిక్రమ్ డైరెక్ట్ చేయటంతో ఈ యాడ్ అదిరిపోయే రీతిలో వచ్చి ఉంటుందని బావిస్తున్నారు. ఈ యూడ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో జరిగింది. ఈ ప్రకటన కోసం మహేష్ భారీగానే రెమ్యునేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

Mahesh Babu will ask to buy bus tickets

ఈ యాడ్ లో పాల్గొనడానికి మహేష్ మురుగదాస్ తో చేస్తున్న సినిమాకి సైతం బ్రేక్ ఇచ్చారు. దీంతో మురుగదాస్ టీమ్ కూడా అహమ్మదాబాద్ లో లొకేషన్లు వెతుక్కునే పనిలో పడింది. బ్రహ్మోత్సవం సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు జెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.

Mahesh Babu will ask to buy bus tickets

ఇప్పటికే చాలా బ్రాండ్లను తన కిట్టీలో వేసుకున్న మహేష్.. అసలు వేరే హీరోలు ఎవ్వరూ పోటీ ఇవ్వలేనంత రేంజులో పిచ్చెక్కిస్తున్నాడు కదూ. సూపరంటే సూపర్‌ కదా..

- Advertisement -