1010 చిన్నారులకు ప్రాణంపోసిన మహేశ్..!

740
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్‌గానే కాదు తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ముందువరసలో ఉంటారు హీరో మహేశ్ బాబు. తన సొంత ఖర్చుతో దత్తత గ్రామాల అభివృద్దే కాదు గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తున్నారు మహేశ్.

ఇప్పటివరకు డె సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న 1010 చిన్నారులకు హార్ట్ స‌ర్జ‌రీలు చేయించి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు మ‌హేష్‌. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్ లు నిర్వహించడమే కాకుండా అవ‌స‌ర‌మైన వారికి స‌ర్జ‌రీలు కూడా చేయిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు మహేశ్.

శ్రీమంతుడు సినిమా తర్వాత తెలంగాణలో సిద్దాపూర్ – ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెంను దత్తత తీసుకున్న మహేశ్ ఆ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకి ప్రాణం పోస్తున్నారు.

- Advertisement -