ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ నటీనటులుగా దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం ‘స్పైడర్’. ఈ చిత్రంలోని ఓ ఫైట్ కోసం ఏకంగా రూ.20 కోట్లను ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ న్యూస్ ఇపుడు టాలీవుడ్, కోలీవుడ్ చిత్రపరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారింది. స్పైడర్ చిత్రంలో మహేష్ పోలీస్ గూఢచారి పాత్రలో నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో నిర్మితవుతోంది.
ఇటీవలే మహేష్‌బాబు, ప్రతినాయకుడు ఎస్.జె.సూర్య మధ్య ఓ పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. 8 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతున్నది. ఈ ఫైట్ సీక్వెన్స్ కీలక మలుపుగా ఉంటుందని తెలిసింది. 8 నిమిషాల సన్నివేశం కోసం దాదాపు ఇరవై కోట్ల భారీ వ్యయాన్ని చేశారని సమాచారం.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. హ్యరీస్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, ఎన్. వి. ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.