ప్రిన్స్‌తో సుకుమార్ మరోసారి…

182
Mahesh Babu signs film with Rangasthalam director Sukumar
- Advertisement -

మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ సినిమా ఇటీవలె విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. పూర్తిస్థాయి రాజకీయ నేపధ్యంలో రూపొందించిన ఈ చిత్రం ప్రముఖుల నుంచి ప్రశంసలందుకుంది. చాలా రోజలు తర్వాత ఓ భారీ హిట్ అందుకున్న మహేష్‌ ఈ సినిమా విజయంతో ఆనందంలో మునిగి తెలుతున్నారు.

 Mahesh Babu signs film with Rangasthalam director Sukumar

ఇక ప్రిన్స్ ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతుంది. పైడిపల్లి సినిమా తర్వాత మహేష్‌ సుకుమార్ డైరెక్షన్‌లో ఓ మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ చిత్రం ప్లాఫ్‌ను మూటగట్టుకోవటంతో ఎలాగైన మహేష్‌కు ఓ హిట్‌ ఇవ్వాలని అనుకుంటున్నాడట సుకుమార్. ఈయన డైరెక్షన్‌లో వచ్చి ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ సినిమా భారీ విజయాన్ని అందుకుని రికార్డులను సృష్టించింది.

ఇక ఈ లెక్కల మాస్టర్ తదుపరి మహేష్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా మారాడట. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీని అప్పుడే కన్ఫామ్ చేసినట్లు సమాచారం.

- Advertisement -