”ఇది సక్సెస్ సెలబ్రేషన్ లా లేదు. వంద రోజుల వేడుక చేసుకున్నట్లు వుంది. సర్కారు వారి పాట విజయం ఎప్పటికీ గుర్తిండిపోతుంది’ అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులు అలరించి ప్రపంచవ్యాప్తంగా నాగులు రోజుల్లో 153+ కోట్లు వసూళు చేసి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కడు సినిమా షూటింగ్ జరిగినప్పుడు కర్నూల్ వచ్చాను. రెండు రోజుల వ్యవధిలో సర్కారు వారి పాట వేడుక ఇక్కడ పెట్టుకున్నాం. ఐతే ఇంత మంది వస్తారని అనుకోలేదు. మీ అందరినీ చూసిన ఉత్సాహంలో స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేశాను. ఇది మీ కోసమే. మీ అభిమానం ఎప్పుడు ఇలానే వుండాలి. ఇది సక్సెస్ మీట్‌లా లేదు. వంద రోజులు వేడుక చేసుకున్నట్లు వుంది అన్నారు. సర్కారు వారి పాట మా ఫ్యామిలీతో చూసినప్పుడు మా అబ్బాయి గట్టిగా హాగ్ చేసుకున్నాడు. సితార పాప అన్ని సినిమాల్లో కంటే ఇందులో బాగా చేశానని, అందంగా వున్నాని చెప్పింది. నాన్న చూసి.. పోకిరి దూకుడుకి మించిపొతుందని అన్నారు. ఈ క్రెడిట్ దర్శకుడు పరశురాంకి దక్కుతుంది అన్నారు మహేష్.