సర్కార్‌ వారి పాట @ 30 మిలియన్స్‌

138
mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కార్ వారి పాట. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగాన్ని పెంంచింది.

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్,పాటలు అంచనాలను భారీగా పెంచగా సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. మహేష్ మార్క్ మేనరిజంతో వచ్చిన యాక్షన్ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.ఇప్పటికే 30 మిలియన్స్‌కి పైగా పైగా వ్యూస్ దక్కించుకొని రికార్డులను సృష్టిస్తుంది.

1.2 మిలియన్స్ పైగా లైక్స్ తో యూట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా యూఎస్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నడు లేని విధంగా యూఎస్ లో 603 ప్రాంతాల్లో ఈ సినిమాను రిలీజ్ కాబోతుంది.

- Advertisement -