క్లైమాక్స్‌లో మహేశ్ సర్కార్!

50
mahesh
- Advertisement -

పరుశరామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కార్ వారిపాట. మే12 సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ను మహేశ్, సముద్రఖని బ్యాచ్ పై షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ పరశురామ్. మార్చ్ 14 నుంచి మిగిలిన రెండు పాటల షూటింగ్ ను పూర్తిచేసేలా ప్లాన్ రెడీ చేశారు. ప్యాచ్ వర్క్ తో సహా కానిచ్చేసి మార్చ్ 27 నాటికి సర్కారు వారి పాటకు మూవీ యూనిట్ గుమ్మడికాయ కొట్టబోతుంది.

మార్చి 27న షూటింగ్ అయిపోతే పరశురామ్ పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు ప్రమోషన్స్‌పై దృష్టిసారించనున్నాడు. పాన్ ఇండియా వైడ్ సినిమా రిలీజ్ చేయనుండగా ఇప్పటికే తమిళ వర్షన్‌ పనులు స్టార్ట్ కాగా,హిందీతో పాటు మిగిలిన డబ్బింగ్ వర్షన్స్‌పై త్వరలోనే క్లారిటీ రానుంది.

- Advertisement -