“సరిలేరు నీకెవ్వరు” వారం రోజుల కలెక్షన్లు

470
Sarileru Neekevvaru
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మీక మందన హీరోయిన్ గా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో నటించిన ఈచిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11న విడుదలైంది. కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈచిత్రం భారీ విజయాన్ని సాధించింది. వరుసగా సెలవులు ఉండటంతో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈమూవీ రూ.100కోట్ల క్లబ్ లో చేరింది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ.32.77 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్, కర్ణాటక రెస్టాఫ్ ఇండియా కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 46.7 కోట్ల షేర్ వసూలు చేసింది.

మొత్తంగా సంక్రాంతి సెలవులైన భోగి, సంక్రాంతి, కనుమ రోజున వరుసగా రోజుకు రూ. 9 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను రాబట్టింది. ఏడో రోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదే దూకుడు కంటిన్యూ చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 85.56 కోట్ల షేర్ వసూళు చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రూ. 105.6 కోట్లతో సాధించింది. ఇక రేపు వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.

- Advertisement -